అందరికి నమస్కారం,
నా పేరు మోహన రావు, నాకు ఒకమేతో 2007 లో రిజిస్టర్ వివాహం జరిగింది. 2009 లో నాకు ఆమె గురుంచి తెలిసిన విషయం ఏమిటి అంటే, ఆమెకు ఇంతకు ముందే ఇద్దరితో వివాహం అయ్యిపోయింది అని. మొదటి వివాహం రిజిస్టర్ వివాహం. రెండవది ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంది. మొదటి భర్త మా వివాహం జరిగి ఒక సంవత్సరం ఆరు నెలల తర్వాత చనిపోయాడు. ఆమె మొదటి వివాహం ఇంకా రద్దు చెయ్యబడలేదు అంటే విడాకులు తీసుకోలేదు. దీని గురుంచి ఆమెని నిలదీస్తే నా పైన వరకట్న వేధింపులు కేసు అంటే 498a సెక్షన్ లో కేసు పెట్టారు. అప్పటి నుండి కేసు నడుస్తుంది. సాక్షుల విచారణ ముగిసింది. ఇంకా ఇద్దరు సాక్షులు మాత్రమె ఉన్నారు.
మా న్యాయవాది వాళ్ళని క్రాస్ ఎక్షమినతిఒన్ చేసారు. ఆ అమ్మని తన మొదటి వివాహం గురుంచి ఎక్కడ కంప్లైంట్ లో వివరించలేదు. ఒక వివాహం ఉంటుండగా ఇంకొక పెళ్లి చేసుకోవచ్చా. నాకు వచ్చిన సందేహం ఉన్న భయం ఏమిటి అంటే ఈ కేసు లో నాకు నా తల్లిదండ్రులకు ఏమైనా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా . దయచేసి వివరించగలరు.
ధన్యవాదములు
మీ మోహన్